Abn logo
Sep 21 2021 @ 12:20PM

ఎగుమతుల ప్రోత్సాహానికి ఏపీ సిద్ధం: మంత్రి మేకపాటి

విజయవాడ: ఏపీ నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. వాణిజ్య ఉత్సవ్ ఇనాగరేషన్ సెషన్‌లో మంత్రి మాట్లాడుతూ వాణిజ్య ఉత్సవం పేరిట నిర్వహిస్తున్న ఈ సమావేశానికి 600 ఉత్పత్తిదారులు ఎగుమతిదారులు హాజరువుతున్నారన్నారు. తైవాన్, ఏపీ వైశాల్యం అంతే ఉన్నప్పటికీ భారతదేశంతో ఎగుమతుల్లో పోటీపడుతోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎగుమతులపై ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. ఇక్కడ ఉన్న ఎగుమతి అవకాశాల గురించి ప్రపంచానికి చాటి చెప్పాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. కొవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందని... ఎగుమతులు ప్రభావితం అయ్యాయన్నారు.  రాష్ట్రంలో వివిధ వనరులతో పాటు నైపుణ్యం వంటి మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption