Abn logo
Jun 23 2021 @ 20:46PM

'రామ్ కీ ఫార్మా సిటీ'పై మంత్రి మేకపాటి సమీక్ష

అమరావతి: రామ్ కీ ఫార్మా సిటీపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రామ్ కీ ఫార్మా సిటీ విస్తరణకు కసరత్తు జరుగుతుందని మంత్రి మేకపాటి  తెలిపారు. ఫార్మా సిటీతో మరిన్ని ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల పెంపునకు ప్రణాళిక తయారు చేయాలని కోరారు. ఫార్మా సిటీ దగ్గర కేటాయించిన కంపెనీల స్థాపనకు వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సూచించారు.