వారికి ఏం పనిలేక విమర్శలు చేస్తున్నారు: మంత్రి

ABN , First Publish Date - 2020-02-22T22:21:37+05:30 IST

బీజేపీ నేతలకు ఏం పనిలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వారు చేసే నిరాధార ఆరోపణలకు

వారికి ఏం పనిలేక విమర్శలు చేస్తున్నారు: మంత్రి

హైదరాబాద్: బీజేపీ నేతలకు ఏం పనిలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వారు చేసే నిరాధార ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రైతుబంధు అందరికీ వస్తుందని మంత్రి తెలిపారు. కొన్ని చోట్ల సాంకేతిక లోపం వల్ల నిధులు అందడం లేదని వివరించారు. రైతుబంధు అమలు కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. రైతుబంధు సీలింగ్ కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన లేదన్నారు. రాష్ట్రంలో రైతు మరణాలు దాదాపుగా తగ్గాయన్నారు. ఎవరైనా రైతు మరణాలపై ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపించాలని మంత్రి సవాల్ విసిరారు. పంటరుణాలు పెంచాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని, అది కేంద్రం పరిధిలోని అంశం అనే విషయం వారికి తెలియదా? అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.


శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్‌పై దృష్టి పెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 45వేల ఎకరాల ఆయిల్ పామ్‌ సాగుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. కందుల కొనుగోళ్ల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. కందులను మొత్తం కొనాలంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన పరిమితి మేరకు కొనుగోళ్లు చేశామని మంత్రి తెలిపారు.

Updated Date - 2020-02-22T22:21:37+05:30 IST