Advertisement
Advertisement
Abn logo
Advertisement

వడ్లను కేంద్రం కొంటుందా? లేదా?: మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కేంద్రం కొంటుందో, లేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అసలు విషయం చెప్పడం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తాయని, రా రైస్ రావని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేసారు. దీనికి పరిష్కారం చూపించే బాధ్యత కేంద్రంపై లేదా అని నిరంజన్‌రెడ్డి నిలదీసారు. ప్రజాస్వామ్య హక్కులపై మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా అని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రజల ఆవేదన కేంద్రానికి పట్టదా అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement