ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నిరాశ పరిచింది: మంత్రి నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-11-27T15:49:33+05:30 IST

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నిరాశ పరిచిందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏడాదిలో ఎంత ధాన్యాన్ని సేకరిస్తారో చెప్పడం అసాధ్యమన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నిరాశ పరిచింది: మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నిరాశ పరిచిందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏడాదిలో ఎంత ధాన్యాన్ని సేకరిస్తారో చెప్పడం అసాధ్యమన్నారు. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించామన్నారు. యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం చెప్పిందన్నారు. కేంద్రం ఎంత కొనుగోలు చేస్తుందో టార్గెట్‌ చెప్పమన్నామన్నారు. ఏడాదికి ఒకేసారి టార్గెట్‌ ఇవ్వలేమని కేంద్రం చెప్పిందన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2021-11-27T15:49:33+05:30 IST