Abn logo
Oct 22 2021 @ 07:49AM

ఆ ప్రాంతాల్లో దుకాణాలు తొలగించండి

                       - మంత్రి సెంథిల్‌ బాలాజీ


పెరంబూర్‌(Chennai): పాఠశాలలు, ప్రార్థనాస్థలాల సమీపంలో ఉన్న టాస్మాక్‌ మద్యం దుకాణాలు తొలగించాలని విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. నగరంలోని ఎక్సైజ్‌ కార్యాలయంలో బుధవారం టాస్మాక్‌ జిల్లా మేనేజర్లు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలు, ప్రార్థనా స్థలాలకు దగ్గరగా ఉన్న టాస్మాక్‌ దుకాణాలను వేరే ప్రాంతాలకు తరలించేలా సత్వరం చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


ఇవి కూడా చదవండిImage Caption