రూ. 200.11 కోట్లు విరాళంగా ఇచ్చాం : మంత్రి పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2020-04-02T19:48:24+05:30 IST

కరోనాపై పోరుకు సీఎం సహాయ నిధికి రూ. 200.11 కోట్ల విరాళం అందజేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రూ. 200.11 కోట్లు విరాళంగా ఇచ్చాం : మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి : కరోనాపై పోరుకు సీఎం సహాయ నిధికి రూ. 200.11 కోట్ల విరాళంగా ఇచ్చామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖ ఉద్యోగులు విరాళం చెక్కులను సీఎం జగన్‌కు పెద్దిరెడ్డి అందించారు.


అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. చాలా మంది ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందిస్తున్నారన్నారు. పంచాయతీ రాజ్, మైనింగ్ నుండి మొత్తం 200.11 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించామని.. ఒక్క రోజులో 96 శాతం పెన్షన్‌లు అందించినట్లు తెలిపారు. కరోనా కట్టడికి అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో అందరూ ముఖ్యమంత్రికి సహకరించాలని.. ఆ దిశగా అందరు పని చేయాలని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.


ఈ 200.11 కోట్లల్లో.. 

జిల్లా మైనింగ్ ఫండ్‌లో రూ. 187 కోట్లు

ఏపీఎండీసీ నుంచి రూ. 10.62 కోట్లు

మైన్స్ అండ్ జియాలజీ శాఖ ఉద్యోగుల విరాళం రూ. 56 లక్షలు

ఉపాధి హామీ, వాటర్ షెడ్ శాఖ ఉద్యోగుల విరాళం రూ. 1.50 కోట్లు

సెర్ప్ ఉద్యోగుల విరాళం రూ. 50 లక్షలు ఉన్నాయి.

Updated Date - 2020-04-02T19:48:24+05:30 IST