శాసనసభలో చంద్రబాబు సతీమణి ప్రస్తవన రాలేదు: మంత్రి Perni nani

ABN , First Publish Date - 2021-11-20T19:45:29+05:30 IST

చంద్రబాబు సతీమణిని ఎవరైనా ఏమైనా అని ఉంటే ఆ ఫోన్ రికార్డును బయట పెట్టాలని మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు.

శాసనసభలో చంద్రబాబు సతీమణి ప్రస్తవన రాలేదు: మంత్రి Perni nani

అమరావతి: చంద్రబాబు సతీమణిని ఎవరైనా ఏమైనా అని ఉంటే ఆ ఫోన్ రికార్డును బయట పెట్టాలని మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. అసలు చంద్రబాబు సతీమణి ప్రస్తవన శాసనసభలో రాలేదన్నారు. ఆమె పేరును శాసనసభలో ప్రస్తావించినట్టుగా చంద్రబాబు చిత్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. శాసనసభలో చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి మెలో డ్రామా సృష్టించారన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను, ఆయన సతీమణి పేరును శాసనసభలో ఎవరు ఉచ్చరించలేదని స్పష్టం చేశారు. రాజకీయాలను రాజకీయలతోనే ఎదుర్కోవాలని సూచించారు. కుటుంబ మర్యాదను పక్కన పెట్టి చంద్రబాబు ఈ డ్రామా చేశారని వ్యాఖ్యానించారు. అసత్యాలు, నిందా పూర్వక ధోరణితో చంద్రబాబు కొత్త సంప్రదాయనికి తెరతీశారన్నారు. అంత సంస్కారం లేకుండా ఎవరూ మాట్లాడరని మంత్రి తెలిపారు.


అసెంబ్లీలో ఫోన్లతో రికార్డు చేయకూడదని... కానీ టీడీపీ సభ్యులు రికార్డు చేసిన వీడియోను అందరికి పంపారన్నారు.  అనని మాటలను ఇద్దరు శాసన సభ్యులకు అపాదించటం రాజకీయంగా దుర్మార్గపు ప్రక్రియ అని మండిపడ్డారు. నటులు బాలకృష్ణ ఆయన తోబుట్టువులు కూడా ఈ ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఎన్టీఆర్ గురించి వారికి చెడుగా నమ్మించగలిగిన చంద్రబాబు ఈ అంశంలో కూడా ఇలాగే చేస్తున్నారని మంత్రి పేర్నినాని విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2021-11-20T19:45:29+05:30 IST