Advertisement
Advertisement
Abn logo
Advertisement

15 నుంచి వాహన మిత్ర పథకం ప్రారంభం: మంత్రి పేర్ని నాని

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాహన మిత్ర పథకాన్ని ఈ నెల 15న  సీఎం జగన్‌ ప్రారంభిస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు. వెల్ఫేర్ స్కీమ్స్ క్యాలెండర్ ప్రకారం జూలైలో ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఆటో కొనుక్కున్న వారు ఈ నెల 8 నుంచి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి  నాని సూచించారు. 10వ తేదీ నుంచి అర్హులో కాదో ఎంపీడీఓలు వెరిఫికేషన్ చేస్తారని మంత్రి తెలిపారు. 

ఇంట్లో 300 యూనిట్స్ కరెంట్ వాడకం ఉన్నవారికి ఈ పథకం వర్తించదని పేర్ని నాని స్పష్టం చేశారు. వెయ్యి చదరపు అడుగుల ఇల్లు, మూడు ఎకరాల మెట్ట, పది ఎకరాల మాగాణి ఉన్నవారిని కూడా సస్పెన్స్‌లో పెట్టడం జరిగిందని మంత్రి పేర్ని నాని వివరించారు. జాబితాలో లబ్ధిదారుల పేరు లేకపోతే సచివాలయంలో తగిన ఆధారాలతో సంప్రదించాలని పేర్ని నాని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement