హీరోలు నాని, సిద్ధార్థ్‌లకు Minister Perni Nani స్ట్రాంగ్ కౌంటర్..

ABN , First Publish Date - 2021-12-28T20:24:29+05:30 IST

టాలీవుడ్‌పై జగన్ ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.

హీరోలు నాని, సిద్ధార్థ్‌లకు Minister Perni Nani స్ట్రాంగ్ కౌంటర్..

అమరావతి : టాలీవుడ్‌పై జగన్ ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో అమరావతిలో కీలక సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల పాటు పలు విషయాలపై చర్చించిన అనంతరం నాని మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా టికెట్ల రేట్లు, థియేటర్ల మూసివేతతో పాటు.. గతంలో హీరోలు చేసిన వ్యాఖ్యలకు కూడా మంత్రి కౌంటర్‌గా మాట్లాడారు.


మాకేం తెలుసు..!?

హీరో నాని గతంలో కిరాణా కొట్టు లెక్కలు చూశారేమో.. మాకు ఎలా తేలుస్తుంది?. సిద్ధార్థ వ్యాఖ్యలు తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి ఉండొచ్చు. అసలు సిద్ధార్థ్ ఇక్కడ ట్యాక్స్‌లు కట్టారా..?. మేం ఎంత విలాసంగా ఉంటున్నామో సిద్ధార్థ్‌ చూశాడా..?. స్టాలిన్, మోదీ కోసమో ఆయన ఆ మాటలు అనుంటాడు’ అని మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాగా.. ఇటీవల సినిమా రిలీజ్‌కు ముందు హీరో నాని మీడియా మీట్‌లో సినిమా టికెట్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సిద్ధార్థ్ కూడా ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలపై మంత్రి నాని స్పందిస్తూ పై విధంగా కౌంటరిచ్చారు.


ఎవరి మీదా కోపం లేదు..!

సినిమా టికెట్ ధరలపై డిస్ట్రిబ్యూటర్లు ప్రతిపాదనలు ఇచ్చారు. కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లో అత్యధికంగా రూ.150, లోయర్‌ క్లాస్‌లో రూ.50 ఉండాలని కోరారు. ఇతర ప్రాంతాల్లో ఏసీ థియేటర్లలో అత్యధికంగా రూ.100, లోయర్‌ క్లాస్‌లో రూ.40 ఉండాలని కోరారు. సినీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకు ఎవరి మీదా కోపం లేదు.. ఉండదు. రేట్‌లు రివ్యూ చేయడానికి కమిటీ వేశారు. అభ్యంతరాలు ఉంటే కమిటీ దృష్టికి తీసుకురావచ్చు. గతంలో బాలకృష్ణ సినిమాకు మినహాయింపు ఇచ్చి.. చిరంజీవి సినిమాకు ఇవ్వలేదు. అయితే జగన్‌కు మాత్రం అలాంటి రాగద్వేషాలు ఉండవు అని మంత్రి చెప్పుకొచ్చారు.


థియేటర్ల మూసివేతపై..!

కొన్ని థియేటర్లలో కనీసం ప్రమాణాలు పాటించడం లేదు. రెన్యూవల్ చేయకుండానే కొన్ని థియేటర్లను నడిపిస్తున్నారు. థియేటర్లు రెన్యూవల్ చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ప్రమాణాలు పాటించని కొన్ని థియేటర్లను సీజ్‌ చేశాం. హాళ్లలో వసతులు మెరుగుపర్చాలని ఇదివరకే చెప్పాం. హైకోర్టు సూచనల మేరకు కమిటీ ఏర్పాటు చేశాం. వివిధ సంఘాల సూచనలు, విజ్ఞప్తులను కమిటీ పరిశీలన చేస్తుంది. సామాన్యులకు వినోదాన్ని ఇవ్వడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ నిర్ణయిస్తుంది. చాలా థియేటర్లు ఫైర్ సేఫ్టీ, బీఫామ్‌ లేకుండా నడుస్తున్నాయి. త్వరగా రెన్యువల్ చేసుకోవాలని కోరాం. రెన్యువల్‌ చేసుకోని థియేటర్లపై చర్యలు తీసుకున్నాం. కొందరు ఎత్తుగడలో భాగంగా జీవోకు నిరసనగా మూసేశామంటున్నారు అని మంత్రి చెప్పారు.


ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2021-12-28T20:24:29+05:30 IST