Advertisement
Advertisement
Abn logo
Advertisement

పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు: పోచారం

నిజామాబాద్: పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిఅన్నారు. బాన్సువాడ నియోజక వర్గానికే పదివేల ఇండ్లు మంజూరయ్యాయని, అర్హులైన వారందరికీ ఇండ్లను ఇస్తామని ఆయన పేర్కొన్నారు. బాన్సువాడ నియోజక వర్గం పరిధిలోని వర్ని మండలంలోని ఎస్ఎన్ పురం, హుమ్నాపూర్, రాజ్ తండా, శంకోర తండా లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎస్ఎన్ పురం పంచాయతీ పరిధిలోని కోటయ్య క్యాంపులో రూ.15 లక్షలతో నూతనంగా నిర్మించనున్న కాపు సంఘం భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. 


అలాగే హుమ్నాపూర్ గ్రామంలో 40 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు భూమి పూజ చేసి, రూ. 36 లక్షలతో నిర్మించే అదనపు తరగతి గదులకు, రూ. 10 లక్షలతో ఎస్సీ (మాదిగ) కమ్యునిటీ భవనం, రూ. 7.50 లక్షలతో గోసంగి కమ్యునిటీ భవనాలకు శంకుస్థాపన చేశారు. అలాగే అసంపూర్తిగా ఉన్న ఎస్సీ(మాల) కమ్యునిటీ భవనానికి రూ. 5 లక్షలు, వెటర్నరీ భవనానికి రూ. 5 లక్షలు అదనంగా మంజూరు చేశారు. రాజ్ పేట  తండాలో నూతనంగా నిర్మించనున్న 20 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు భూమి పూజ, రూ. 9 లక్షలతో నిర్మించే అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గానికి మరో అయిదువేల ఇళ్ళను తెచ్చి మిగిలిన పేదలందరికి మంజూరు చేస్తానని అన్నారు. 


రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దయ ఆ భగవంతుడి ఆశీర్వాదంతో నియోజక వర్గం ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో స్వంత ఇల్లు లేని పేదలందరికి స్వంత ఇంటి కలను నిజం చేయడమే నా ఆశయమన్నారు.దేశంలో  రెండు వేల రూపాయలు ఆసరా పెన్షన్లుగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.రాష్ర్టంలో రూ.12,000 కోట్ల ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని స్పీకర్ పోచారం వెల్లడించారు. 

Advertisement
Advertisement