తెరపై విలన్.. బయట స్ఫూర్తిదాయక హీరో.. సోనూసూద్‌పై ప్రశంసలు

ABN , First Publish Date - 2020-05-24T03:53:23+05:30 IST

వలస కార్మికులకు అండగా నిలిచి, వాళ్లు స్వస్థలాలకు వెళ్లడానికి సాయం చేస్తున్న బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్‌పై మహారాష్ట్ర ఎన్‌సీపీ చీఫ్ జయంత్ పాటిల్ ప్రశంసల వర్షం కురిపించారు.

తెరపై విలన్.. బయట స్ఫూర్తిదాయక హీరో.. సోనూసూద్‌పై ప్రశంసలు

ముంబై: వలస కార్మికులకు అండగా నిలిచి, వాళ్లు స్వస్థలాలకు వెళ్లడానికి సాయం చేస్తున్న బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్‌పై మహారాష్ట్ర ఎన్‌సీపీ చీఫ్ జయంత్ పాటిల్ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు అండగా నిలవడం నిజంగా ఆదర్శవంతమైన పని అని ఆయన కొనియాడారు. ‘వలస కార్మికుల కోసం సోనూసూద్ బస్సులు ఏర్పాటు చేస్తున్నాడు. వాళ్లంతా తమ ఇళ్లకు చేరేందుకు తన వంతు సాయం అందిస్తున్నాడు. ఈ ఆన్‌స్క్రీన్ విలన్ బయటమాత్రం స్ఫూర్తిదాయక హీరో’ అంటూ ట్వీట్ పాటిల్ చేశారు.

Updated Date - 2020-05-24T03:53:23+05:30 IST