ఉత్తర ప్రదేశ్‌లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-03-08T22:04:03+05:30 IST

తాము అధికారంలో ఉత్తర ప్రదేశ్‌లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో బీజేపీ నాయకులు

ఉత్తర ప్రదేశ్‌లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

మహబూబ్ నగర్: తాము అధికారంలో ఉత్తర ప్రదేశ్‌లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని వారికి మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. మహబూబ్ నగర్‌లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలతో కలిసి ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలను ఆసరాగా చేసుకుని నిరుద్యోగులను బీజేపీ నాయకులు రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారని బీజేపీ నాయకులపై ఆయన ఆరోపణలు చేశారు. బీజేపి పాలిత రాష్ట్రాల్లో వారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.


ఈ ఐదేళ్ళ కాలంలో రాష్ట్రంలో లక్షా ముప్పై వేల ఉద్యోగాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిందని ఆయన తెలిపారు. మరో డెబ్బై వేల ఉద్యోగాలకుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని ఆయన వివరించారు. 



పీఆర్సీ విషయంలో ఉద్యోగులను బీజేపీ నాయకులు రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగులకు మంచి పీఆర్సీని సీఎం కేసీఆర్ ఇస్తారని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులకు పీఆర్సీ, పదోన్నతులు ఇవ్వడం తమ భాధ్యతని ఆయన పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపించే బాధ్యతను ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. 

Updated Date - 2021-03-08T22:04:03+05:30 IST