Advertisement
Advertisement
Abn logo
Advertisement

వలంటీర్లపై పుష్పశ్రీవాణి సంచలన వ్యాఖ్యలు

విజయనగరం: రాష్ట్రంలో పనిచేస్తున్న వలంటీర్లపై మంత్రి పుష్పశ్రీవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. కురుపాం నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో వైసీపీ, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని శ్రీవాణి పేర్కొన్నారు. గరుగుబిల్లి మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వలంటీర్ భర్త ఎన్నికల్లో పోటీ చేశారని పుష్ప శ్రీవాణి తెలిపారు. వలంటీర్ల వ్యవస్థను ప్రధాని సైతం కొనియాడారని పుష్పశ్రీవాణి అన్నారు. 

Advertisement
Advertisement