Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటీఎస్‌ సద్వినియోగం చేసుకోండి : మంత్రి

ఉండి/పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 3 : జగన్నన సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారులకు భూమిపై శాశ్వత హ క్కు లభిస్తుందని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. యండగండి లో శుక్రవా రం జగన్నన శాశ్వత గృహ హక్కు పఽథకంలో లబ్ధిపొందిన శ్రీనివాస రాజుకు రుణ విముక్తి ధ్రువీకరణ పత్రా న్ని అందించారు.రాష్ట్రంలో పేదల రుణ భారాన్ని తగ్గించాలనే సంకల్పంతో సంపూర్ణ గృహ హక్కు చట్టాన్ని ప్రభుత్వం తెచ్చిందని వైసీపీ నాయకుడు యడ్ల తాతాజీ తెలిపారు.కార్యక్రమంలో సర్పంచ్‌ చిన్న కృష్ణమూర్తి, కార్యదర్శి రామాం జనేయులు, డీఈ శివరామరాజు, ఏఈ రామకృష్ణంరాజు పాల్గొన్నారు.


ఆకివీడు పరిధిలో 935 మంది లబ్ధిదారులు


ఆకివీడు : ఆకివీడు పరిధిలో  1983 నుంచి 2013 వరకూ  గృహ నిర్మాణా లకు  935 మంది లబ్ధిపొందారని ఎంపీడీవో శ్రీకర్‌ తెలిపారు. పట్టణ పరిధి ఐదు సచివాలయాల వలంటర్లీతో శుక్రవారం సమీక్షించారు.లబ్ధిదారులు ఎంత రుణం తీసుకున్నా రూ.10 వేలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఈ నెల 21 నుంచి సంబంధిత సచివాలయాల సెక్రటరీలు రిజిస్ట్రేషన్లు చేసి వారికి పత్రాలు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ భాస్కరరాజు ఉన్నారు. 

Advertisement
Advertisement