Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణలో 40 శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరు: మంత్రి Sabita

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్కూళ్లల్లో పారిశుధ్యం పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కొవిడ్ నిభందనలు తప్పక పాటించాలని ఆదేశాలు ఇచ్చామని...ప్రార్థన  సమయంలోనే జాగ్రత్తలు గుర్తు చేయాలని తెలిపారు. 60 లక్షల మంది విద్యార్థుల్లో 20 లక్షల మంది ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారన్నారు. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్‌లో అదనంగా లక్ష మంది జాయిన్ అయ్యారని అన్నారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 2 న్నర లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చాయన్నారు. విద్యార్థులను తమ సొంత బిడ్డలా చూసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. 

Advertisement
Advertisement