Abn logo
Aug 28 2021 @ 14:03PM

పాఠశాలల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం: మంత్రి Sabita

హైదరాబాద్: సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సర్వం సిద్ధమైనట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పిల్లల ప్రాణాలకు ఎటువంటి అభద్రత అవసరం లేదన్నారు. ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటామో తరగతి గదుల్లో అలాగే భద్రంగా చూస్తామని భరోసా ఇచ్చారు. రెండేళ్లుగా విద్యావ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అయ్యిందన్నారు. ఇకపై పాఠశాలలు తెరవకపోతే విద్యా ప్రమాణాలు పూర్తిగా దెబ్బ తింటాయని తెలిపారు. కరోనా జాగ్రత్తలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్నచోట తరగతుల విభజన ఉంటుందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలపై నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. పిల్లలకు మాస్క్ పెట్టి పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని చెప్పారు. అనుమానం ఉంటే వెంటనే కరోనా టెస్ట్‌లు చేయించేలా అన్ని చోట్ల ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.