కొవిడ్‌ కట్టడికి వైద్యులు సమష్టిగా కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-05-16T06:25:28+05:30 IST

కొవిడ్‌ కట్టడికి వైద్యులు సమష్టిగా కృషి చేయాలి

కొవిడ్‌ కట్టడికి వైద్యులు సమష్టిగా కృషి చేయాలి
మహబూబాబాద్‌ వైద్యుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సత్యవతిరాథోడ్‌

మంత్రి సత్యవతిరాథోడ్‌ 

మహబూబాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ నియంత్రణకు సమష్టిగా  కృషి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ భవనంలో శనివారం రాత్రి ప్రైవేట్‌ వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ... కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని, దానిని కట్టడి చేసేందుకు వైద్యులు పూర్తిస్థాయిలో సహాకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ సేవలందించే ప్రైవేట్‌ ఆస్పత్రులకు సైతం ఆక్సిజన్‌ కొరత లేకుండ చూస్తామని చెప్పారు. ఐసోలేషన్‌లలో కూడా తగిన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌ సమీపంలోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాల, కళాశాల భవన్‌లో ఐసోలేషన్‌ కేంద్రం ఉందని, దీంతో పాటు జిల్లా కేంద్రం సమీపంలోని అనంతారం మోడల్‌ స్కూల్‌ను ఐసోలేషన్‌ కేం ద్రంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతికదూరం పాటించి కరోనా వైరస్‌ను కట్టడి చేయాలన్నారు. అదేవిధంగా లాక్‌డౌన్‌లో ప్రభుత్వ నిబంధనలు పాటించి సహాకరిం చాలని కోరారు.  

Updated Date - 2021-05-16T06:25:28+05:30 IST