గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-06-17T05:43:55+05:30 IST

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి
రైతువేదికను ప్రారంభిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే సీతక్క

నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి సత్యవతి రాథోడ్‌ 

కొత్తగూడ, జూన్‌ 16 : గిరిజన ప్రాంత అభివృద్ధికి నిరంత రం కృషి చేస్తామని, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహబూ బాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలో బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్‌ పర్యటించారు. కొత్తగూడ, పొగుళ్లపల్లిలోని రైతు వేదికలను ఎమ్మెల్యే దనసరి సీతక్క, జడ్పీ చైర్‌పర్సన్‌ బిందుతో కలిసి ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దోమతెరలను పంపిణీ చేశారు. ఆస్పత్రిలో ప్రసవించిన మహి ళకు కేసీఆర్‌ కిట్‌ అందజేశారు. అనంతరం పొగుళ్లపల్లిలో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్‌ గురుకుల పాఠశాల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంత సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు మేరుగైన వైద్యసేవలు అం దుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రతీ మండలంలో గు రుకుల పాఠశాలలు ఏర్పాటుచేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. రైతు బంధు పథకాలు ప్రవేశ పెట్టి రైతులకు పెట్టుబడి అందిస్తున్నామన్నారు. రైతు వేదిక లు నిర్మించి పంటలపై రైతులకు అవగాహన కలిగిస్తున్నా మన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని మంత్రి సూచించారు. చెస్‌ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఏకలవ్య మోడల్‌ గురుకుల పాఠశాల విద్యార్థి వంశీని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మె ల్యే దనసరి సీతక్క, జడ్పీ చైర్‌పర్సన్‌ బిందు, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, ఐటీడీఏ పీవో హన్మంత్‌ కే జెండాగే, ఓడీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ దేశిడి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ పుల్సం పుష్పలత, ఎంపీపీ బానోత్‌ విజయరూప్‌సింగ్‌, డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రునాయక్‌, ఏడీఏ లక్ష్మీనా రాయణ, తహసీల్దార్‌ చందా నరేష్‌, ఎంపీడీవో కరణ్‌సింగ్‌, ఏవో ఉదయ్‌, సర్పంచ్‌లు రణధీర్‌, మంగమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T05:43:55+05:30 IST