పీవీ విజ్ఞాన వేదిక డిజైన్ సిద్ధం:శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2021-01-26T02:04:54+05:30 IST

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు భారత మాజీ ప్రధాని, స్వర్గీయ పి వి నరసింహరావు నివసించిన వంగర గ్రామమును పర్యాటక కేంద్రంగా

పీవీ విజ్ఞాన వేదిక డిజైన్ సిద్ధం:శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు భారత మాజీ ప్రధాని, స్వర్గీయ పి వి నరసింహరావు నివసించిన వంగర గ్రామమును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయటానికి సుమారు 11 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో పీవీ విజ్ఞాన వేదిక డిజైన్ లను రాష్ట్ర  పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దివంగత, మాజీ ప్రధానమంత్రి పీవీ శతజయంతి వేడుకలలో భాగంగా సీఎం కేసిఆర్ అదేశాల మేరకు ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలనే అశయంతో ఆయన పేరిట పీవీ విజ్ఞాన వేదిక ను వంగర గ్రామంలో నిర్మిస్తున్నామన్నారు.


మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మృతివనం తరహాలో పీ వీ విజ్ఞాన వేదిక ను తీర్చిదిద్దుతున్నామన్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.తెలంగాణ రాష్ట్రం గర్వించే వ్యక్తిగా పట్వారీ నుండి ప్రధానమంత్రిగా ఎదిగిన పీవీ  ప్రతి  ఒక్కరికి స్పూర్తి ప్రధాత గా నిలిచారన్నారు.  పీవీ  ప్రవేశ పెట్టిన సంస్కరణలు, ఆయన పరిపాలన భవిష్యత్ తరాలకు తెలిసేలా సీఎం కెసిఆర్ అదేశాల మేరకు పీవీ నివసించిన ఇంటిని మ్యూజియంగా, వంగర గ్రామంలో పీవీ పేరుతో సుమారు 8 ఎకరాలలో పీవీ విజ్ఞాన వేదిక ను రూపోందిస్తున్నామన్నారు.


అందుకు మొదటి దశలో 7 కోట్ల రూపాయలతో పీ వీ విజ్ఞాన వేదిక లో విగ్రహానికి ఫౌంటైన్, లైటింగ్, ఆయన విజయాలు , పోటో గ్యాలరీ, మోడిటేషన్ సెంటర్, సైన్స్ మ్యూజియం, మేజ్ గార్డేన్, చిల్డ్రన్ ఆట స్థలాలు, స్వాతంత్ర సమరయోధుల శిల్పాలు, యాంఫి థియేటర్, ఫుడ్ కోర్టుల నిర్మాణానికి 686.25 లక్షల రూపాయలను కేటాయించామన్నారు.  మొత్తం ప్రాజేక్టు వ్యయం 1098.45 లక్షలతో వంగర లో పీవీ విజ్ఞాన వేదికను నిర్మిస్తున్నామన్నారు. 

Updated Date - 2021-01-26T02:04:54+05:30 IST