ఎక్సైజ్ అధికారులను సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2021-10-24T22:18:28+05:30 IST

దాదాపు రెండుకోట్ల రూపాయల విలువైన 5 కేజీల మెపిడ్రిన్ డ్రగ్స్ ను పట్టుకున్నఎక్సైజ్ శాఖ అధికారులను అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

ఎక్సైజ్ అధికారులను సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: దాదాపు రెండుకోట్ల రూపాయల విలువైన 5 కేజీల మెపిడ్రిన్ డ్రగ్స్ ను పట్టుకున్నఎక్సైజ్ శాఖ అధికారులను అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మార్కెట్ లో 2  కోట్ల రూపాయలపై విలువైన సుమారు 5 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ ను పట్టుకొని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. అధికారుల పనితీరు ప్రశంసనీయమని మంత్రి అన్నారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం తో పనిచేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకుని మత్తు పదార్థాలను తయారు చేస్తున్న, రవాణా చేస్తున్న,అమ్మకాలు చేస్తున్న, వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. 


ఇచ్చిన ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్ చంద్రయ్య సూచనలతో మేడ్చెల్ - మల్కాజిగిరి జిల్లాలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ నేతృత్వంలోని గట్టి నిఘా ఏర్పాటుచేశారు. విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం తో సిబ్బంది పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 5 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ ను పట్టుకొని సీజ్ చేసినట్టు మంత్రి తెలిపారు. ఆంధ్ర - ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా ల నుండి గంజాయి, మొదలైన మత్తు పదార్థాలను తెలంగాణ రాష్ట్రం నుండి రవాణా కాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి నిఘా ను ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అబ్కారీ శాఖ అధికారులు గట్టి నిఘా ను, పకడ్బందీగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు  చేశామన్నారు.


వచ్చే30 రోజుల్లో రాష్ట్రంలో మత్తు పదార్థాలను సరఫరా నిర్ములనే లక్ష్యంగా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో మంచి పనితీరును కనబరిచిన అధికారులను గుర్తించి వారికి అవార్డులు, రివార్డులు అందిస్తామన్నారు. మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న వారి వివరాలు, సమాచారాన్ని అందించిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. సమాచారం అందించిన వారికి తగిన ప్రోత్సాహకాలను అందించాలని మంత్రి అబ్కారీ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ చంద్రయ్య, మేడ్చెల్ ఈ ఎస్ విజయ్ భాస్కర్, సీఐ సహదేవ్ తో పాటు ఆయన సిబ్బందిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.

Updated Date - 2021-10-24T22:18:28+05:30 IST