Abn logo
Sep 28 2021 @ 09:16AM

టూరిజం హబ్‌గా తెలంగాణ :మంత్రి శ్రీనివాస్‎ గౌడ్‌

హైదరాబాద్/కృష్ణానగర్‌: భవిష్యత్‌లో తెలంగాణ మంచి టూరిజం హబ్‌గా మారుతోందని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యుఖమంత్రి చొరవతో ఎన్నో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసుకోగలిగామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. టూరిజం ప్లాజాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో 2020-21 సంవత్సరానికి పర్యాటకశాఖ ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ పొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ముత్యాల ధార వంటి పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేస్తే ఎందరికో ఉపాధి కల్పించవచ్చని అన్నారు. రాష్ట్ర అవతరణ తరువాత విదేశీ పర్యాటకులు 69 శాతానికి పెరిగారన్నారు. సినిమా  షూటింగ్‌లకు కూడా ఎంతో అవకాశముందని  మంత్రి చెప్పారు. తెలంగాణలో ఉన్న గొప్ప చరిత్రను గత పాలకులు తొక్కేశారన్నారు. దేశంలోనే రెండో పెద్ద జలపాతం ముత్యాల ధార తెలంగాణలో ఉందన్నారు. రామప్ప దేవాలయం ఏంతో అద్భుతమన్నారు.టూరిజం హబ్‌గా మారడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసకుంటోందన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి పాటు పడిన 16 విభాగాల్లోని వారికి పర్యాటక శాఖ అవార్డులను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ ఎండీ మనోహర్‌రావు, కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.