Abn logo
May 21 2020 @ 11:16AM

చిరు ఇంట్లో తలసాని, దర్శకనిర్మాతల భేటీ.. గ్రీన్ సిగ్నల్ ఉంటుందా!?

హైదరాబాద్ : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరూ సమావేశం అయ్యారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కొద్దిసేపటి క్రితమే చిరు ఇంటికి వచ్చారు. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్ అనుమతి ఇవ్వడంతో.. టాలీవుడ్‌ పరిస్థితేంటి..? అనేదానిపై గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలోని పెద్దలు చర్చించుకుని ప్రభుత్వాన్ని సంప్రదించాలని భావిస్తున్నారు. అందుకే ఇవాళ చిరు ఇంట్లో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లపై నిశితంగా చర్చ జరగనుంది. 


సాయంత్రంకల్లా గ్రీన్ సిగ్నల్!?

ఇప్పటికే హీరో నాగార్జున, దర్శకధీరుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజు, హీరో నాని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, అల్లు అరవింద్, కొరటాల శివ, సి కళ్యాణ్, రవి కిషోర్, త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ, నిర్మాత నాగ వంశీ చిరు ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ భేటీ జరిగే అవకాశముంది.


ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు షూటింగ్స్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనేదానిపై ఓ నివేదికను సైతం సిద్ధం చేశారని.. భేటీలో భాగంగా తలసానికి ఇవ్వనున్నారని తెలియవచ్చింది. అయితే సినిమా, సీరియల్స్, షో షూటింగ్స్‌కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని సాయంత్రానికల్లా ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు వచ్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. భేటీ అనంతరం చిరుతో కలిసి తలసాని మీడియా మీట్ నిర్వహిస్తారని తెలిసింది.

Advertisement
Advertisement
Advertisement