బేగంపేట నాలాలో పూడిక తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2021-06-14T20:00:53+05:30 IST

వర్షాకాలం ప్రారంభమైన నేపద్యంలో నగరంలోని నాలాలు పొంగకుండా వరద నీరుసాఫీగా వెళ్ళేందుకు పూడిక తీత పనులు నిర్వహిస్తున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,

బేగంపేట నాలాలో పూడిక తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి తలసాని

హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభమైన నేపద్యంలో నగరంలోని నాలాలు పొంగకుండా వరద నీరుసాఫీగా వెళ్ళేందుకు పూడిక తీత పనులు నిర్వహిస్తున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాలాల అక్రమణ, పూడిక తీత పనుల విషయంలో ప్రభుత్వం సీరియస్ ఉందని ఆయన అన్నారు. సోమవారం బేగంపేట నాలాలో జరుగుతున్న పూడిక తీత పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుండి వారం రోజుల పాటు నగరంలోని అన్ని నాలాలను స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులతో కలిసి పనులు పరిశీలించాలని అన్నారు. వర్షా కాలంలో వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు.


వివిధ శాఖల అధికారుల సమన్వయంతో నాలాల ప్రక్షాళన కోసం వారం పాటు పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. నాలాల కబ్జా, ఇతర పిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది.సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని అందమైన సిటీగా తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్ లో గత ఏడేళ్ళలో ఎంతో అభివృద్ధి జరిగింది నగరంలో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన నాలాలు ఉన్నాయి.నాలాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనులను ప్రభుత్వం చేపట్టిందన్నారు.దీని కోసం 45కోట్ల రూపాయలను కేటాయించినట్టు మంత్రి తలసాని తెలిపారు.నాలాలపై స్పెషల్ డ్రైవ్ లో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలని పేర్కొన్నారు. నాలాలపై ఉన్న ఆక్రమణలు కూడా తొలగిస్తాం. అక్కడ ఉండే పేదలకు పునరావాసం కల్పిస్తామని అన్నారు.


నాలాలలో పూడిక తొలగింపుకు సంబంధించిన పిర్యాదులను చేయాల్సిన నెంబర్లు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్యాలయం 9848282309. జీహెచ్ఎంసి మేయర్  కార్యాలయం 9030066666, నాలాల లో పూడిక తొలగింపు పనులను మరింత వేగవంతం చేయడం కోసం 6 జోన్ లకు ప్రత్యేక అధికారుల నియామకం జరిగింది. సికింద్రాబాద్ జోన్, అనిల్ రాజ్ ఎస్ఈ, 9989930374, ఖైరతాబాద్ జోన్, రత్నాకర్, ఎస్ఈ,  9491642490, ఎల్బి నగర్ జోన్, అశోక్ రెడ్డి, ఎస్ఈ  9849906733, చార్మినార్ జోన్,  నర్సింగ్ రావు,ఎస్ఈ 9704405314, శేరిలింగంపల్లి జోన్, చిన్నారెడ్డి, ఎస్ఈ 9989930363, కూకట్ పల్లి జోన్, శంకర్ ఎస్ఈ 8978026758,  జీహెచ్ఎంసి హెల్ప్ లైన్ 21111111 మై జీహెచ్ఎంసి యాప్ లకు పిర్యాదు చేయవచ్చని మంత్రి తెలిపారు. 

Updated Date - 2021-06-14T20:00:53+05:30 IST