గొల్ల,కురుమలకు దైవ స్వరూపం కేసీఆర్: తలసాని శ్రీనివాస్ యాదవ్

ABN , First Publish Date - 2021-07-22T22:28:31+05:30 IST

గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి లక్షాధికారులను చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

గొల్ల,కురుమలకు దైవ స్వరూపం కేసీఆర్: తలసాని శ్రీనివాస్ యాదవ్

మ్మికుంట: గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి లక్షాధికారులను చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొల్ల, కురుమలకు ఆయన దైవ స్వరూపమని కొనియాడారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట లోని దినేష్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమల ను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం ముఖ్య మంత్రి మానసపుత్రిక అని అన్నారు. 11 వేల కోట్లతో  గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినారని మంత్రి తెలిపారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం లో యూనిట్ ధర గతంలో 1,25,000 ఉండేదని రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దానిని  1,25,000 నుండి 1,75,000 రూపాయలకు  యూనిట్ ధరను పెంచినట్లు తెలిపారు. 


రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 28న జమ్మికుంటలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ హుజూరాబాద్ నియోజకవర్గం లోని అర్హులైన లబ్ధిదారులకు గొర్రెల యూనిట్ల పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు హుజూరాబాద్ నియోజక వర్గం లో లబ్ధిదారుల వాట క్రింద 2874 మంది  డిడిలు చెల్లించారు అని తెలిపారు. ఇంకా 1500 మంది డీడీలు  చెల్లించాల్సి ఉందని అన్నారు. వారు కూడా వెంటనే డీడీలు చెల్లించాలని అన్నారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా పంపిణీ చేసిన గొర్రెలకు వైద్యం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 100 అంబులెన్సులు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. గోర్లకు ఎలాంటి వ్యాధి సోకిన వెంటనే 1098 కు ఫోన్ చేస్తే అంబులెన్స్ ద్వారా వైద్యులు ఇంటి వద్దకే వచ్చి మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తారని మంత్రి తెలిపారు. నీతి నిజాయితీకి మారు పేరు గొల్ల కురుమలు అని, గొల్ల కురుమల అభివృద్ధికి ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. 


గొల్ల కురుమల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతోనే గురుకులాలను ముఖ్యమంత్రి ప్రారంభించారని తెలిపారు . గురుకులాలలో కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా విద్య అందించబడుతుంది అని అన్నారు. యాదవులకు కొమురవెల్లి మల్లన్న, కురుమలకు బీరప్ప దేవుడు ఎలాగో వారిద్దరి స్వరూపం ముఖ్యమంత్రి అని తెలిపారు. ప్రభుత్వము పంపిణీ చేస్తున్న గొర్రెల యూనిట్లతో సంపద పెంచుకోవాలని మంత్రి సూచించారు .రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. అందులో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , రైతు బంధు, రైతు బీమా పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి అని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. జీవలకు గడ్డి, మందులు, నీరు, అంబులెన్సు ద్వారా వైద్యం అందిస్తుంన్నామని అన్నారు.హైదరాబాదులో 5ఎకరాలలో యాదవ కమ్యూనిటీ భవనాన్ని ముఖ్యమంత్రి నిర్మించారని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగు నీరు అందిస్తున్నమని అన్నారు.


Updated Date - 2021-07-22T22:28:31+05:30 IST