సినీ ఎగ్జిబిటర్ల సమస్యలపై త్వరలో సమావేశం: తలసాని

ABN , First Publish Date - 2021-07-23T22:57:05+05:30 IST

సినీ ఎగ్జిబిటర్ ల సమస్యలపై త్వరలోనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

సినీ ఎగ్జిబిటర్ల సమస్యలపై త్వరలో సమావేశం: తలసాని

హైదరాబాద్: సినీ ఎగ్జిబిటర్ ల సమస్యలపై త్వరలోనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  తెలిపారు. సింగిల్ స్క్రీన్ దియేటర్ లలో పార్కింగ్ చార్జి వసూలు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం పట్ల శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ ఎగ్జిబిటర్ లు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై ఉన్నతాధికారులతో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి వారికి వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మురళి మోహన్, కార్యదర్శి సునీల్ నారంగ్, సినీ ఎగ్జిబిటర్స్ సదానంద్ గౌడ్, అభిషేక్, బాల గోవిందరాజు, అనుపమ్ రెడ్డి, మడుపు శ్రీనివాస్, అశోక్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-23T22:57:05+05:30 IST