గొల్ల కురుమల ఆర్ధికాభివృద్ధికే గొర్రెల పంపిణీ: తలసాని

ABN , First Publish Date - 2021-07-28T22:37:40+05:30 IST

తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని హుజరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట నుంచి లాంఛనంగా ప్రారంభించామని ,ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

గొల్ల కురుమల ఆర్ధికాభివృద్ధికే గొర్రెల పంపిణీ: తలసాని

జమ్మికుంట: తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని హుజరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట నుంచి లాంఛనంగా ప్రారంభించామని ,ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని 6 వేల కోట్లతో ప్రారంభించామని మంత్రి తెలిపారు .రాష్ట్రంలోని 18 సంవత్సరాలు దాటిన ప్రతి గొల్ల కురుమలకు గొర్రెల  యూనిట్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు . రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయుటలో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ ,మైనార్టీ వర్గాల  జీవితాల్లో వెలుగులు  నింపుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి ,సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. 


రాష్ట్రంలో  6వేల కోట్ల 70 లక్షలతో మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని తెలిపారు .మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం లో 80 లక్షలు గొర్రెల యూనిట్లను గొల్లకుర్మలకు పంపిణీ చేశామని తెలిపారు. వాటి ద్వారా కోటి 30 లక్షల గొర్రె పిల్లలు ఉత్పత్తి అయ్యాయని అన్నారు. తద్వారా దేశం లోనే గొర్రెల సంపద ఎక్కువ గల రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. దళితుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. 



రాష్ట్ర  సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం లో 80 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రారంభించుకున్నామని అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం లో 4 వేలకు పైగా లబ్ధిదారులకు గొర్ల యూనిట్లు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. గొల్ల కురుమల ను గొప్పగా గౌరవించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ,శాసనమండలి సభ్యులు ఎగ్గే మల్లేశం, వరంగల్ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనితరావు , జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, పశుసంవర్ధక శాఖ ఎండి రామచందర్ ,అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు,. తదితరులు పాల్గొన్నారు 




Updated Date - 2021-07-28T22:37:40+05:30 IST