రాష్ట్రవ్యాప్తంగా గొర్రెలు,మేకలకు నట్టల మందుపంపిణీ

ABN , First Publish Date - 2021-08-06T19:59:08+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల పంపిణీ చేయనున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు

రాష్ట్రవ్యాప్తంగా గొర్రెలు,మేకలకు నట్టల మందుపంపిణీ

గజ్వేల్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల పంపిణీ చేయనున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్ గ్రామంలో ఉచిత నట్టల నివారణ మందు పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ నెల 6 నుండి 13 వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.


జీవాల ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జీవాల వద్దకే వైద్య సేవలు తీసుకెళ్లాలనే ప్రధాన లక్ష్యంతో సంచార పశువైద్యశాలలు ప్రారంభించామన్నారు.సంవత్సరానికి 3 సార్లు ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నామన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ కోసం 6 వేల కోట్ల రూపాయలు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ 11 వేల కోట్ల రూపాయల తో గొర్రెలను పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి కి గొల్ల కురుమలు రుణపడి ఉంటారని అన్నారు.



Updated Date - 2021-08-06T19:59:08+05:30 IST