తెలంగాణలో కుల వృత్తులు, గ్రామీణ వ్యవస్దల బలోపేతం- తలసాని

ABN , First Publish Date - 2020-08-15T23:20:51+05:30 IST

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని డెబ్బయి నాలుగేళ్లలో జరగని అబివృద్ది కేవలం ఆరేళ్లలో జరుగుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

తెలంగాణలో కుల వృత్తులు, గ్రామీణ వ్యవస్దల బలోపేతం- తలసాని

మెదక్‌: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని డెబ్బయి నాలుగేళ్లలో జరగని అబివృద్ది కేవలం ఆరేళ్లలో జరుగుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఈ విషయంలో దేశం మొత్తం తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకుంటుందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెదక్‌కలెక్టరేట్‌లో జాతీయపతాకాన్నిఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 74 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఆరేళ్ల కాలంలో జరిగిందన్నారు. మెదక్‌జిల్లా అభివృద్ధి పధంలో దూసుకెళ్తోందన్నారు. ఈవిషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఒకవైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. అమర వీరుల త్యాగాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. 


ఆరేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిన తెలంగాణ వైపు యావత్‌ దేశం, ఆయా రాష్ర్టాలు ఆదర్శంగాచూస్తున్నాయని చెప్పారు. ఇది మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. రైతులకు 24గంటల కరెంట్‌ ఇవ్వడంతో పాటు ఎన్నో అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత ప్రభుత్వానిదేనని చెప్పారు. గతంలో బెంగళూరు, మహారాష్ట్రలకు ధీటుగా హైదరాబాద్‌  ఐటీ హబ్‌ పెరిగిందన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆనందించాలని అన్నారు. అనంతరం మెదక్‌పట్టణంలోని గోసముద్రం చెరువులో చేప పిల్లలను వదిలారు. పట్టణంలో కరోనా ఐసొలేషన్‌ సెంటర్‌, చిల్డ్రన్స్‌పార్కు వద్ద నిర్మించిన పబ్లిక్‌ టాయిలెట్స్‌ స్ధానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ హేమలత, మెదక్‌, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు, అడిషనల్‌కలెక్టర్‌ నగేష్‌, జిల్లా ఎస్పీ చందనాదీప్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-15T23:20:51+05:30 IST