డీడీలు చెల్లించిన వారికి వెంటనే గొర్రెల పంపిణీ: తలసాని

ABN , First Publish Date - 2021-09-15T20:28:25+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పధకంలో భాగంగా డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు వెంటనే గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని

డీడీలు చెల్లించిన వారికి వెంటనే గొర్రెల పంపిణీ: తలసాని

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పధకంలో భాగంగా డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు వెంటనే గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై అన్ని జిల్లాల పశు వైద్యాధికారులతో మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి మంత్రి తలసాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెల యూనిట్ ధర 1.25 లక్షల నుండి 1.75 లక్షలకు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ పెరిగిన  లబ్ధిదారుల వాటా  పై గ్రామసభల ద్వారా వివరించి సేకరించాలని అన్నారు. మంత్రి అన్ని జిల్లాల్లో గొర్రెల మార్కెట్ ల నిర్మాణానికి కలెక్టర్ ల సహకారంతో భూమి సేకరించాలని అన్నారు. కృత్రిమ గర్భధారణ, వ్యాక్సిన్ పంపిణీ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు. వివిధ పధకాల అమలులో భాగంగా  గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో  జీవాల సంఖ్య  పెరగడంతో హాస్పిటల్స్ కు డిమాండ్ పెరుగుతోందన్నారు. 

Updated Date - 2021-09-15T20:28:25+05:30 IST