పేద ప్రజలు సంతోషంగా ఉండాలనేదే కేసీఆర్ లక్ష్యం: తలసాని

ABN , First Publish Date - 2021-11-01T20:19:18+05:30 IST

పేద ప్రజలు అందరు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు

పేద ప్రజలు సంతోషంగా ఉండాలనేదే కేసీఆర్ లక్ష్యం: తలసాని

హైదరాబాద్: పేద ప్రజలు అందరు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదల బాగు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పధకాలు ప్రవేశ పెడుతున్నార, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం సనత్ నగర్ నియోజక వర్గం పరిధిలోని బన్సీలాల్ పేట లోని బండ మైసమ్మ నగర్, చా చా నెహ్రూ నగర్ లలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. డిసెంబర్ 5 న బండ మైసమ్మ నగర్ లో  310 గృహల ప్రవేశం జరుగుతుందని తెలిపారు. పేదలు గౌరవ ప్రదంగా జీవించాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని చెపా్పరు. అలాగే డిసెంబర్ 8న చాచా నెహ్రూ నగర్ లో 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రవేశం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పేదలు గొప్పగా బ్రతకాలనే ఉద్దేశ్యం తో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, త్రాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందని తెలిపారు. 

Updated Date - 2021-11-01T20:19:18+05:30 IST