ఈ నెల 17న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-08T21:57:52+05:30 IST

సనత్ నగర్ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు ఈ నెల 17 వ తేదీన ఉదయం 10.30 గంటలకు ప్రారంభించనున్నారు

ఈ నెల 17న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

హైదరాబాద్: సనత్ నగర్ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు ఈ నెల 17 వ తేదీన  ఉదయం 10.30 గంటలకు ప్రారంభించనున్నారు.బన్సీలాల్ పేట లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటీఆర్ ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బండ మైసమ్మ నగర్ లో 27.2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 310 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,సీసీ నగర్ లో 20.46 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 264 ఇండ్లను 17 వ తేదీన ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని తెలిపారు.


ఇండ్ల కేటాయింపులో ఎలాంటి విమర్శలకు అవకాశం లేకుండా లబ్ధిదారులతో రెవెన్యూ, హౌసింగ్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి అర్హులను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు.సరైన సౌకర్యాలు, వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గుర్తించి అన్ని సౌకర్యాల తో తమ సొంత ఇంటిలో పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఆత్మగౌరవం తో బ్రతకాలనే సదుద్దేశంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో తప్ప దేశంలో ఎక్కడా ఈ కార్యక్రమం అమలు కావడం లేదని వివరించారు.

Updated Date - 2021-12-08T21:57:52+05:30 IST