సిరివెన్నెల మృతి పట్ల దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2021-11-30T23:24:52+05:30 IST

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

సిరివెన్నెల మృతి పట్ల దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన మంత్రి తలసాని

హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 165 కు పైగా చిత్రాలకు 3 వేలకు పైగా పాటలు రాసి మూడున్నర దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రచయితగా సిరివెన్నెల రాణించారు.సిరివెన్నెల రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యం అన్నారు. ఆయన మృతి తో చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప గేయ రచయితను కోల్పోయిందని మంత్రి తలసాని పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి మంత్రి ప్రగాడ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2021-11-30T23:24:52+05:30 IST