Abn logo
Jun 11 2021 @ 15:46PM

నాలాల పై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం-తలసాని

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నాలాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఈమేరకు త్వరలో నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తామన్నారు. శుక్రవారం వర్షాకాల కాల ప్రణాళిక పై జీహెచ్‌ఎంసి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్‌అలీ, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నాలాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. 


ఈసారి అలా కాకుండా నాలాల పూడిక తీత పనులు ముమ్మరంగా జరరగుతున్నాయని తెలిపారు. అలాగే నాలాలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. నాలాలపై ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లనుకేటాయిస్తామని తర్వాత ఇక్కడి నుంచి వారిని తరలిస్తామన్నారు. నగరంలో 1,368 కి.మీ. మేరకు నాలాల అభివృద్ధి జరుగుతోందని మంత్రి తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో త్వరలోనే నాలాలపై వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని చెప్పారు. ఓపెన్‌ నాలాల్లోని పూడికను మిషనరీ సహాయంతో తొలగిస్తున్నట్టు తెలిపారు. నాలాలు, చెరువుల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హెచ్చరించారు. 

Advertisement