రైతులకు మద్దతుగా ధర్నా చౌక్ వద్ద ఆందోళన: Minister talasani

ABN , First Publish Date - 2021-11-10T16:23:23+05:30 IST

వరి కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా రైతులకు మద్దతుగా ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపడుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు.

రైతులకు మద్దతుగా ధర్నా చౌక్ వద్ద ఆందోళన: Minister talasani

హైదరాబాద్: వరి కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా రైతులకు మద్దతుగా ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపడుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ఈనెల 12న రైతులకు సంఘీభావంగా అధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్నా సందర్భంగా ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద స్థలాన్నిమంత్రులు తలసాని, మహమూద్ అలీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అనేక రకాల అభివృద్ధి జరిగిందని తెలిపారు. 2014 ముందు రైతులు అనేక ఇబ్బందులు ఎదురుకొన్నారన్నారు. దేశంలో పంజాబ్ తరువాత అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.


నల్ల చట్టాల ద్వారా దేశంలో రైతాంగాన్ని  కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. విలువైన ప్రభుత్వరంగ పరిధిలో ఉన్న వాటిని ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తోందన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు రెండు నాలుకలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేస్తుందని స్పష్టం చేశారు. ఇక్కడి బీజేపీ నేతలు వరి పండించమని చెప్తుంటే..  కేంద్రం కొనమని చెప్తోందని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాలపై దేశ వ్యాప్తంగా ఉన్న విపక్షాల మద్దతు తీసుకుంటామన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలే వెంకటేశ్వర్లు, దానం నాగేందర్‌ ధర్నాచౌక్ స్థలాన్ని పరిశీలించారు. 

Updated Date - 2021-11-10T16:23:23+05:30 IST