గణేష్ నిమజ్జంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం: మంత్రి తలసాని

ABN , First Publish Date - 2021-09-14T19:09:15+05:30 IST

గణేష్ నిమజ్జంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

గణేష్ నిమజ్జంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం:  మంత్రి తలసాని

హైదరాబాద్: గణేష్ నిమజ్జంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని...మరొక రోజులో  తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తున్నామన్నారు.  ట్యాంక్ బండ్ సహా  గ్రేటర్ పరిధిలో అనేక లేక్స్‌లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని చెప్పారు. హుస్సేన్ సాగర్‌లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామనటం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అభిప్రాయం మాత్రమే అని అన్నారు. వాళ్ళ అభిప్రాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గణేష్ చతుర్థికి దేశంలోనే హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానమని... అందుకు తగిన ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

Updated Date - 2021-09-14T19:09:15+05:30 IST