Abn logo
Sep 20 2021 @ 13:41PM

అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది?: Talasani

సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. జిల్లాలోని బెజ్జంకి మండలం తోటపల్లి ఆన్‌లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో మంత్రి తలసాని చేప, రొయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉందని... ఇప్పుడు ఏం చేస్తుందని నిలదీశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు పునర్జీవం కల్పిస్తూ సంక్షేమ పథకాలను అందిస్తోందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 93 కోట్ల చేప పిల్లలను రూ.25 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేపట్టిందన్నారు. గొల్ల కుర్మలకు పెండింగ్ డిడిలకు చెందిన గొర్రె పిల్లలను త్వరలోనే అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption