అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాల సమర్పణ

ABN , First Publish Date - 2021-08-01T19:42:25+05:30 IST

ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి, పాతబస్తీ హరి బౌలి లో గల బంగారు మైసమ్మ అమ్మవారికి,

అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాల సమర్పణ

హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి,  పాతబస్తీ హరి బౌలి లో గల బంగారు మైసమ్మ అమ్మవారికి, శాలిబండ లోని అక్కన్న మాదన్న ఆలయంలో, ఉప్పుగూడ లోని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల వద్ద పూర్ణకుంభంతో వేదపండితులు మంత్రికి స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగ గా ప్రకటించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. భక్తులు పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యం తో ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ సంస్కృతి కి ప్రతీక గా నిలిచే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుండి వస్తారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారి ని కోరుతున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-08-01T19:42:25+05:30 IST