తెలంగాణ‌లో క్రైమ్ రేట్ తక్కువ: తలసాని

ABN , First Publish Date - 2021-03-27T22:28:31+05:30 IST

తెలంగాణ‌లో క్రైమ్ రెట్ చాలా తక్కువగా ఉంది..దీనికి ప్రధాన భూమిక సీసీ కెమెరాలు పోషిస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ‌లో క్రైమ్ రేట్ తక్కువ: తలసాని

హైదరాబాద్: తెలంగాణ‌లో క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంది..దీనికి ప్రధాన భూమిక సీసీ కెమెరాలు పోషిస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ వ్యాఖ్యానించారు.  శనివారం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా కీలకమని చెప్పారు. ఇండియాలో లా అండ్ ఆర్డర్ బాగుంది అంటే హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. 75 వేల రూపాయలు ప్రతి పోలీస్ స్టేషన్‌కి అవసరాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోందని చెప్పారు. 7లక్షల 75 వేల కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. 


సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రజలకు మంచి చేసిన వాళ్లమవుతున్నామని  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. ఎలాంటి నేరం అయిన క్షణాల్లో సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ఛేదిస్తున్నారన్నారు. సీసీ కెమెరాల ద్వారా మెట్రో సిటీ లాంటి నగరంలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. షీ టీమ్స్ ద్వారా ఆకతాయిలను కట్టడి చేస్తున్నారని  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. నార్త్ జోన్‌లో ఎక్కువ కేసులు నమోదు కావని చెప్పారు.లా అండ్ ఆర్డర్ విషయంలో కేసీఆర్ అద్భుతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. రాష్ట్రప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సూచించారు. 

Updated Date - 2021-03-27T22:28:31+05:30 IST