Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు

విజయవాడ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్య లక్ష్మి, దేవినేని అవినాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం నేటికి అమలవుతుందంటే ఆయన గొప్ప తనం ఏంటో అర్ధమవుతోందన్నారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తూ... అందరి అభిమానాన్ని పొందుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.


ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దేశంలోనే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళుతున్న ఏకైక రాష్ట్రం ఏపీ అన్నారు. సమ సమాజ న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాల వారి ఎదుగుదలకు ముఖ్యమంత్రి చేయూత ఇస్తున్నారని విష్ణు అన్నారు.

Advertisement
Advertisement