అమరావతి: దేవాలయాల ప్రక్షాళణే ప్రభుత్వ లక్ష్యమని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేుశారు. దొంగలను దాచే సంస్కృతి తెలుగుదేశం ప్రభుత్వానిది అని విమర్శించారు. అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన జగనన్న ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆలయాల ప్రక్షాళణ దిశగా వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతుందని అన్నారు. ఆరోపణలు వచ్చిన ఉద్యగులపై కఠిన చర్యలు చేపట్టడం జరిగిందని... ద్వారక తిరుమల, విశాఖ, గుంటూరు జిల్లా దేవాలయాల ఉద్యోగులపై చర్యలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే విధంగా నేడు దుర్గమ్మ ఆలయంలో కూడా ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. దీనిని కూడా కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆలయాల్లో రాజకీయలకు, అవినీతికి తావులేదన్నారు. పారదర్శక పాలనే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.