విజయవాడ: పంచగ్రామాల సమస్యపై కూలంకుశంగా చర్చించామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సింహాచలం పంచగ్రామాల సమస్యపై సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, కన్నబాబు, అనకాపల్లి ఎంపీ సత్యవతి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పంచగ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా సమావేశం ఆలస్యమైందని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు వారిని అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు.