కరోనా కోసం జనరల్‌ ఆసుపత్రిలో పడకలను పెంచుతున్నాం

ABN , First Publish Date - 2020-08-04T10:51:50+05:30 IST

జిల్లాలో కరోనా వచ్చిన వారి కోసం ఆసు ప త్రుల్లో పడకలను పెంచుతున్నామని మంత్రి ప్ర శాంత్‌రెడ్డి తెలిపారు.

కరోనా కోసం జనరల్‌ ఆసుపత్రిలో పడకలను పెంచుతున్నాం

నగరంలోని నాలుగు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స

మందులను అధిక ధరలకు అమ్మే  మెడికల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 


నిజామాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి ప్రతి నిధి): జిల్లాలో కరోనా వచ్చిన వారి కోసం ఆసు ప త్రుల్లో పడకలను పెంచుతున్నామని మంత్రి ప్ర శాంత్‌రెడ్డి తెలిపారు. కరోనా బాధితులు ఆందోళన చెందవద్దని సోమవరం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం చికిత్స కోసం అవసరమైన చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా మందులను అధిక ధరలకు విక్రయించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని మందుల దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. ఎక్కువ ధరలకు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్‌ చికిత్సకు అవసరం అయిన పావిబ్లూ, రెమిడెసివర్‌, మల్టీ మానిటరింగ్‌ మీటర్స్‌, ఐసీయూ పోల్డర్స్‌ కాట్స్‌ను తెప్పిస్తు న్నట్లు వివరించారు. జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను 450కి పెంచుతున్నట్లు తెలిపారు.


ఈ పడకలకు అవసరమై న రూ.68 లక్షలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో గతంలో వెంటిలేటర్లు 25 ఉండగా 45 కొత్తవి తెప్పించి వాటి సంఖ్యను 70కి పెంచినట్లు తెలిపారు. ఆసుపత్రిలో ఐసోలేషన్‌ పడకల సంఖ్యను పెంచడంతో పాటు అన్నింటికి ఆక్సిజన్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆర్థిక స్థోమత ఉన్నవారి కోసం నాలుగు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇచ్చిన ట్లు మంత్రి తెలిపారు. నగరంలో ఉన్న తిరుమల, హోప్‌, మనోరమ, ప్రతిభ ఆసుపత్రులకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఆసుపత్రుల్లో రెండు, మూడు రోజుల్లో చికిత్స అందిస్తారని తెలిపారు. ప్రభుత్వం కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కోసం అన్ని ఏర్పాట్లను చేస్తోందని ఆయన తెలిపారు.

Updated Date - 2020-08-04T10:51:50+05:30 IST