Advertisement
Advertisement
Abn logo
Advertisement

2022 ఆగస్టు నాటికి వెలిగొండ ద్వారా నీరు: మంత్రి విశ్వరూప్

ప్రకాశం: రాయలసీమకు ముఖ్యమైన వెలిగొండ ప్రాజెక్టును అనుకున్న ప్రకారం 2022 ఆగస్టు నాటికి పూర్తి చేసి ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని మంత్రి విశ్వరూప్ తెలిపారు. కేంద్ర గెజిట్‌లో లేదంటూ వెలిగొండ ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు గెజిట్‌లో లేని విషయంతో పాటు పూర్తి సమాచారాన్ని కేంద్రానికి అందించామన్నారు. ఇప్పటికే చాలా వరకూ ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. 6.5 కిలోమీటర్ల టన్నెల్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. అనుకున్న ప్రకారం 2022 ఆగస్టు నాటికి ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. ప్రాజెక్టు విషయంలో జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement