మంత్రి పర్యటనలో నిరసనలు.. అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-04-20T06:10:17+05:30 IST

మండలంలో మంత్రి కేటీఆర్‌ పర్యటనలో నిరసన తెలిపేందుకు ప్రయ త్నించిన వివిధ పార్టీల నాయకులను సోమవారం పోలీసులు అడ్డుకున్నారు. బస్టాండ్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ నాయకులు ఒక్కసారిగా చొచ్చుకు రావడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నారు.

మంత్రి పర్యటనలో నిరసనలు.. అడ్డుకున్న పోలీసులు
పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఉన్న నాయకులు

ఇల్లంతకుంట, ఏప్రిల్‌ 19: మండలంలో  మంత్రి కేటీఆర్‌ పర్యటనలో నిరసన తెలిపేందుకు ప్రయ త్నించిన వివిధ పార్టీల నాయకులను సోమవారం  పోలీసులు అడ్డుకున్నారు. బస్టాండ్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ నాయకులు ఒక్కసారిగా చొచ్చుకు రావడానికి ప్రయత్నించగా  అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి స్థాయిని పెంచాలని బీజేపీ నాయకులు సెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కి నిరసనకు దిగారు. మంత్రి కార్యక్రమాలు ముగించుకొని వెళ్తుండగా ఏబీవీపీ నాయకులు ఒక్కసారిగా  రైతువేదిక వద్దకు వచ్చి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దీంతో అక్కడున్న టీఆర్‌ఎస్‌ నాయకులు ఏబీవీపీ నాయకులను పక్కకు తప్పించే  క్రమంలో దాడి చేశారు.  పోలీసులు ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 


పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో  టీఆర్‌ఎస్‌, బీజేపీ ఘర్షణ

 పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే టీఆర్‌ఎస్‌,  బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది.  మంత్రి కేటీ ఆర్‌ పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రైతువేదిక వద్ద ఏబీవీపీ నాయకులు అడ్డుపడడంతో వారిని కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంత్రి కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఏబీవీపీ నాయకులపై ఫిర్యాదు చేయడానికి  టీఆర్‌ఎస్‌ నాయకులు పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లారు. ఇదే సమయంలో ఏబీ వీపీ, బీజేపీ నాయకులు ఏకమై టీఆర్‌ఎస్‌ నాయకులపై దాడులు చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న మరికొంతమ ంది టీఆర్‌ఎస్‌ నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ప్రతిదాడులు చేశారు. పోలీసులు ఇరువర్గాల కు నచ్చజెప్పడానికి శ్రమించారు. ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఇదే సమయంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు రాగా అతడిపై దాడిచేశారు. మండలకేంద్రంలోని ఓ ఆలయం వద్ద ఉన్న బీజేపీ నాయకుడి కారు ధ్వంసమైంది.  పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పడం, అద నపు పోలీసు బలగాలు రావడంతో ఉద్రిక్తత సద్ధు మణి గింది. ఫిర్యాదు చేయడానికి వెళ్తే దాడులు చేసిన బీజేపీ, ఏబీవీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.


 బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్‌లు 

గంభీరావుపేట: మండలంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో బీజేపీ నాయకులను పోలీస్‌లు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.  ఎగువ మానేరు నిండి  పొంగి పొర్లడంతో  మంత్రి కేటీఆర్‌ నర్మాల మానేరుకు వచ్చి పూజలు చేశారు.  ముందస్తుగా బీజేపీ మండల  అధ్యక్షుడు  అశోక్‌, నాయకులు కృష్ణకాంత్‌, ప్రసాద్‌రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంధర్బంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ 9వ ప్యాకేజీని పక్కనబెట్టి 11వ ప్యాకేజీ ద్వారా ఎగువ మానేరు నింపడంతో  ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు. 

Updated Date - 2021-04-20T06:10:17+05:30 IST