Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి వ్యాఖ్యలపై వీఆర్వోల నిరసన

ఇందుకూరుపేట, డిసెంబరు 3 : రెవెన్యూ సిబ్బంది పట్ల రాష్ట్ర మంత్రి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేసినందున తహసీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం వీఆర్వోలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మండల వీఆర్వోలందరూ తహసీల్దారు కార్యాలయం ఎదుట మాట్లాడుతూ   పగలు, రాత్రీ అన్న తేడా లేకుండా పనులు చేస్తున్నప్పటికీ మంత్రి అలా మాట్లాడడం సిబ్బందిని అవమానపరచడమేనని వారు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో తమకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే కార్యాచరణ మేరకు ముందుకెళ్తామని పేర్కొన్నారు. అనంతరం రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండలంలోని 15మంది వీఆర్వోలు ఈ నిరసనలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement