ఆలయాలతోనే సంస్కృతి పరిరక్షణ

ABN , First Publish Date - 2021-06-24T05:45:35+05:30 IST

దేశ సంస్కృతిని భావితరాలకు అందిచడంలో ఆలయాలు ముఖ్య పాత్ర వహిస్తాయని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

ఆలయాలతోనే సంస్కృతి పరిరక్షణ
శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, మేకతోటి సుచరిత, ముత్తంశెట్టి శ్రీనివాస్‌

దేవదాయశాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌

ఘనంగా సీతారామ ఆలయ జీర్ణోద్ధరణ శంకుస్థాపన

గుంటూరు(తూర్పు), జూన్‌23: దేశ సంస్కృతిని భావితరాలకు అందిచడంలో ఆలయాలు ముఖ్య పాత్ర వహిస్తాయని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. నగర శివారులోని ఏటుకూరు గ్రామంలో బుధవారం జరిగిన సీతారామ ఆలయ జీర్ణోద్ధరణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లతో కలసి ఆయన పాల్గొన్నారు. అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు స్వామి జ్ఞానప్రసన్న ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  వెలంపల్లి మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి దేవదాయ శాఖ నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు. హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ  తన నియోజకవర్గ పరిధిలో ఇంత పెద్ద ఆలయం నిర్మించబడటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమంలో భాగస్వామినవ్వడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్‌ కావటి మనోహరనాయుడు, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌, లాలుపురం రాము, ఆలయ నిర్వాహకులు ఉగ్గిరాల సీతారామయ్య, గ్రామప్రజలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-24T05:45:35+05:30 IST