ముంపు పొలాల్లో మంత్రుల పర్యటన

ABN , First Publish Date - 2021-11-28T05:28:09+05:30 IST

తుఫాన్‌ కారణం గా నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగరాజు అన్నారు.

ముంపు పొలాల్లో మంత్రుల పర్యటన
పెంటపాడు మండలం బి.కొండేపాడులో కుళ్లిపోయిన వరి పనలను మంత్రి కన్నబాబుకు చూపిస్తున్న రైతులు

ప్రతి రైతును ఆదుకుంటామని కన్నబాబు, చెరుకువాడ హామీ

తణుకు/పెంటపాడు/అత్తిలి/ఇరగవరం/ పెనుమంట్ర, నవంబరు 27 : తుఫాన్‌ కారణం గా నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగరాజు అన్నారు. పెంటపాడు మండలం బి.కొండే పాడు, తణుకు మండలం దువ్వ, అత్తిలి మండలం వరిఘేడు, ఇరగవరం మండ లం రేలంగి, కావలిపురం, పెనుమంట్ర మండ లం ఎస్‌.ఇల్లిందలపర్రు, మల్లిపూడి, జుత్తిగ, పెనుమంట్ర, ఆల మూరు గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను శనివారం పరిశీలిం చారు. ఈ సందర్భంగా రైతులు వర్షాలకు కుళ్లిన వరిపనలను మంత్రులకు చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. పాత యనమదుర్రు డ్రైనేజీ ఆక్రమణల వల్లే వర్షాలకు నష్టపోతున్నామని వివరించడంతో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతులు ఎవరూ ఆం దోళన చెందవద్దని, ఏ ఒక్క రైతు నష్టపోకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్నామని చెప్పారు. రంగు మారిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీ రైతు ఆర్‌బీకేల ద్వారా ధాన్యం అమ్మకాలు జరపాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని పెరవలి, ఉండ్రాజవరం మండలాలకు చెందిన పామాయిల్‌ రైతులు మంత్రి కన్నబాబుకు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, జేసీ అంబేడ్కర్‌, జేడీఏ జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-28T05:28:09+05:30 IST