భారత్‌లో కోవిడ్ రికవరీ రేటు 98.04%గా నమోదు

ABN , First Publish Date - 2021-10-13T23:24:40+05:30 IST

న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా భారత్‌లో ఇప్పటివరకూ 96 కోట్ల 43 లక్షల వ్యాక్సిన్ డోసులు వేశారు.

భారత్‌లో కోవిడ్ రికవరీ రేటు 98.04%గా నమోదు

న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా భారత్‌లో ఇప్పటివరకూ 96 కోట్ల 43 లక్షల వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న ఒక్కరోజే 50 లక్షల 63 వేల డోసులు వేశారు. ఈ ఏడాది జూన్ 21న ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటివరకూ 68 కోట్ల 90 లక్షల మొదటి డోసులు, 27 కోట్ల 40 లక్షల రెండో డోస్‌లు వేశారు. 


మరోవైపు గడిచిన 24 గంటల్లో 14 వేల కేసులు కొత్తగా నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 2,07,653 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 22,844 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ 3,33,42,901 మంది కోలుకున్నట్లైంది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.04%గా నమోదైంది. కోవిడ్ కారణంగా ఇప్పటివరకూ 4,51,189 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 58,63,63,442 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 

Updated Date - 2021-10-13T23:24:40+05:30 IST