మంత్రిగిరి కోసం యడియూరప్ప చుట్టూ ప్రదక్షిణలు

ABN , First Publish Date - 2021-08-01T16:04:51+05:30 IST

మంత్రిగిరి కోసం తాజా మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప చుట్టూ పలువురు నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కే

మంత్రిగిరి కోసం యడియూరప్ప చుట్టూ ప్రదక్షిణలు

బెంగళూరు: మంత్రిగిరి కోసం తాజా మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప చుట్టూ పలువురు నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేబినెట్‌ విస్తరణ అంశం హాట్‌టాపిక్‌ అయింది. రెండురోజులుగా స్వయంగా యడియూరప్ప మంత్రివర్గ విస్తరణలో తన ప్రమేయం లేదని బొమ్మై సొంతంగా నిర్ణయం తీసుకుంటారని, అధిష్ఠానంతో చర్చిస్తారని బహిరంగంగానే ప్రకటించారు. అయినా యడియూరప్పను కలిసేందుకు కావేరికి పలువురు క్యూ కట్టారు. కేబినెట్‌ విస్తరణ తనకు సంబంధించిన అంశం కాదని యడియూరప్ప ప్ర కటనతో వలసనేతలు షా కయ్యారు. వారుసైతం యడియూరప్పను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి రమేశ్‌జార్కిహొళి, మురుగేశ్‌ నిరాణి, రేణుకాచార్య, శివనగౌడ నాయకతోపాటు పలువురు ఎమ్మెల్యేలు యడియూరప్పను కలిశారు. మరోవైపు యడియూరప్ప ఎ మ్మెల్యేలను కలిసేందుకు ఆసక్తి చూపకపోయినా క్యూ కడుతుండడంతో విధిలేక చర్చిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ బొమ్మైను రబ్బర్‌స్టాం్‌పగా వర్ణించగా జేడీఎస్‌ నేత కుమారస్వామి మాజీ సీఎం నీడ అం టూ విమర్శించారు. ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రికి కొత్త స మస్య పట్టుకుంది. మంత్రిగిరి కోసం యడియూరప్ప చెంతకు వెళుతుంటే ప్రతిపక్షాల విమర్శలకు మరింత బలాన్ని ఇచ్చినట్టు అవుతోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను అధిష్ఠానం దాదాపు బలవంతంగానే పక్కన బెట్టింది. వయసు కారణం చూపినా మరిన్ని అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కానీ యడియూరప్ప పదవి కోల్పోయాక ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడడం సర్వత్రా ఆసక్తిరేపుతోంది. పార్టీకోసం ఆ యన సేవలను వర్ణించేందుకు పదాలు లేవనడాన్ని బట్టి చూస్తే ఆయనకు ఇంకా ప్రాధాన్యత ఉందనిపిస్తోంది. ఇక అమిత్‌షా సైతం నిరంతర పోరాటంతో పార్టీని కర్ణాటకలో అభివృద్ధి చేసిన యడియూరప్పను పార్టీ, ప్రభుత్వానికి ఆయన సేవలు అవసరమన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పలువురు మంత్రి పదవికోసం యడియూరప్ప చుట్టూ తిరుగుతున్నారు. 

Updated Date - 2021-08-01T16:04:51+05:30 IST